తాజాగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత శాతం గతం కన్నా మెరుగ్గా ఉందని ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థులు బాధల్లో ఉండగా , పాస్ అయినా విద్యార్థులు ఇంటర్ మీడియట్ చేయడానికి ప్రణాలికలు చేసుకుంటున్నారు. ఈ ఫలితాలలో ఒక విషయం అందరినీ బాధకు గురి చేస్తోంది, ఈ పరీక్షల సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రణవ్ అనే విద్యార్థి తండ్రి తన తల్లిని ఏప్రిల్ 2వ తేదీన హత్య చేశాడు.. కానీ పరీక్షలు జరుగుతుండడంతో ఈ విషయం ఆ అబ్బాయికి ఎవ్వరూ చెప్పలేదు. పరీక్ష తర్వాత తల్లికి అంత్యక్రియలు చేయించారు… ఆ తర్వాత రోజునే తండ్రి కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనితో పుట్టెడు దుఃఖంతో పరీక్షలు పూర్తి చేశాడు. తాజాగా వచ్చిన రిజల్ట్స్ లో ఈ విద్యార్థి 9 .3 GPA తో పాస్ అయ్యాడు. కానీ ఈ సక్సెస్ ను చూడడానికి తల్లితండ్రులు కూడా లేకపోవడంతో బంధువులు మరియు ఊరివాళ్ళు కన్నీటిపర్యంతం అయ్యారు.