ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు ఈ 6 విషయాలని ఎప్పటికీ అర్ధం చేసుకోలేరు..!

-

భార్యని భర్త భర్తని భార్య అర్థం చేసుకుంటేనే వాళ్ళ బంధం బాగుంటుంది. చాలా మంది భార్యాభర్తలు మధ్య గొడవలు ఇందుకే వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా మగవాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన ఈ విషయాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మరి అటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఎక్కువమంది మగవాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఆడవాళ్ళని అర్థం చేసుకోకపోవడం. వాళ్ళు ఏం చెప్పినా కూడా వినరు మధ్యలోనే వాళ్ళు చెప్పేది వినకుండా డైవర్ట్ చేస్తూ ఉంటారు. అడ్డుకుంటారు. నిజానికి చాలామంది ఆడవాళ్లు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు కానీ మగవాళ్ళు వాటిని అస్సలు వినరు.
  2. పిల్లల విషయంలో కూడా మగవాళ్ళు ఆడవాళ్లు చెప్పేది వినరు పిల్లలు ఉండే విషయంలో మగవారు ప్రాథమికంగా చూస్తారు కానీ పిల్లల్ని కనడం అందరికీ ఇష్టం ఉండదు. ఈ విషయాన్ని మగవాళ్ళు వినరు.
  3. ఆడవాళ్ళకి కూడా స్నేహితులు ఉంటారు అయితే మగవాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు వాళ్ళపై కోప్పడతారు మగవాళ్ళు. ఆడవాళ్లకు స్నేహితులు ఉండే విషయాన్ని అసలు పట్టించుకోరు. ఈ విషయంలో ఎప్పుడూ వాళ్ళని అర్థం చేసుకోరు.
  4. అలానే బట్టలు విషయంలో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకోరు ఆడవాళ్ళకి ఇష్టమయ్యే బట్టల గురించి మగవాళ్ళు అస్సలు అర్థం చేసుకోరు, వాళ్ళ ఇష్టాలని అస్సలు గౌరవించరు.
  5. నెలసరి టైం లో కూడా ఆడవాళ్లు అనుభవించే అసౌకర్యాలని అర్థం చేసుకోరు మగవాళ్ళు. ఒంటరిగా ఆడవాళ్ళకి బయటకు వెళ్లాలని ఉంటుంది ఏదైనా ఊరు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని కూడా మగవాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్లకి రక్షణ ఉండదని భావించి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు.
  6. సెక్స్ విషయంలో కూడా ఆడవాళ్ళ గురించి చాలా మంది మగవాళ్ళు పట్టించుకోరు. ఆడవారికి ఫాంటసీ ఉంటుంది. ఆడవారు తమ పార్టనర్‌తో డిఫరెంట్‌గా రొమాన్స్ చేయాలనుకుంటారు కానీ ఇవేమి మగవాళ్ళు అర్ధం చేసుకోరు.

Read more RELATED
Recommended to you

Latest news