BREAKING : వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వైయస్ షర్మిలపై కేసు నమోదు అయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పత్రాలు రిలీజ్ చేశారని ఆరోపణలు వైఎస్ షర్మిలపై ఉన్నాయి.
ఈ తరుణంలోనే బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు. వైఎస్ షర్మిలపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.కాగా, పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా గొరిగినట్లు.. కేసీఆర్ కు అధికారమిస్తే తెలంగాణ మొత్తాన్ని అమ్మకానికి పెడుతుండు. నాటి దొరలు బలవంతంగా భూములు దోచుకుంటే.. నేటి దొర జీవోలతో భూములు అమ్మేసి, వేల కోట్లు వెనకేస్తుండని కేసీఆర్ పై నిన్న షర్మిల ఫైర్ అయ్యారు. రైతులకిచ్చిన అసైన్డ్ భూములను, పరిశ్రమలకిచ్చిన భూములను సైతం వదలడం లేదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అంటే భావితరాన్ని హత్య చేయడమే. భవిష్యత్తు అవసరాలకు భూములే లేకుండా కొల్లగొడుతుండు సారు. ఇదేనా మీరు చెప్పే సంపద సృష్టి? ఇదేనా ధనిక రాష్ట్రం? 2014లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములెన్ని? ఇప్పుడున్న భూములెన్నో దమ్ముంటే కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.