కర్ణాటక రాజకీయాలలో కీలక మలుపు బీజేపీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడం అని చెప్పాలి. కనీసం కాంగ్రెస్ కు పోటీ కూడా ఇవ్వకుండా పరాజయం చెందడం వారి పాలనకు అద్దం పడుతుంది. కాగా ఫలితాలు వచ్చిన అయిదు రోజుల వరకు కాంగ్రెస్ నుండి సీఎం కానున్న వారిని ఎంపిక చేయలేక నానా ఇబ్బందులు పడింది అధిష్టానం. సీఎం అయ్యే అవకాశాలు ఉన్న ఇద్దరు మాజీ సిద్ద రామయ్య మరియు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. ఇద్దరూ మాకంటే మాకే సీఎం కావాలని అడగడంతో అధిష్టానం గందరగోళానికి గురయింది. చివరికి గత రాత్రి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సిద్దరామయ్యను సీఎంగా ఎంపిక చేశారట. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ఇదే ఫైనల్ అని తెలుస్తోంది.
అయితే సిద్దరామయ్యను సీఎం చేయడంపై ఏ విషయాలు అతనికి దోహదపడ్డాయని చూస్తే.. గతంలో సీఎం చేసిన అనుభవం ఉండడం, రాజకీయ జీవితంలో వివాద రహితుడిగా పేరుండడం, కాంగ్రెస్ పార్టీలో అందరితో సానుకూల బంధం ఉండడం, రాష్ట్రాన్ని సీఎంగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేయడం, ఇక సిద్దరామయ్య సామజిక వర్గం కురుబ లు నుండి భారీగా మద్దతు ఉండడం వంటి కొన్ని అంశాలు సీఎంగా ఆయనవైపు ఓటేసేలా అధిష్టానాన్ని ప్రభావితం చేశాయి.