టాలీవుడ్ లో హాస్యనటుడిగా లెజెండరీ కమెడియన్ గా పేరుపొందిన బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మానందం ముఖ ఛాయలోనే ఎంతో కామెడీ చేయగలరు. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో అవకాశాలు తగ్గిన అప్పుడప్పుడు పలు సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు.
తాజాగా కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన రెండో కొడుకు సిద్ధార్థ్, డాక్టర్ ఐశ్వర్యల నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పి.సుబ్బరామిరెడ్డి, ఆలీ, రఘుబాబు తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. విదేశాల్లో చదివిన సిద్ధార్థ్… అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. కాగా, పెద్ద కుమారుడు గౌతమ్ పలు చిత్రాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే.