IPL 2023 : ప్లేఆఫ్స్‌కు చేరిన 4 జట్లు ఇవే..మ్యాచ్‌ డేట్స్‌ ఇవే

-

 

IPL-2023 టోర్నీ కి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. IPL-2023 లో గుజరాత్, CSK, LSG, ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. పాయింట్స్ టేబుల్ లో టాప్-2 లో ఉన్న GT, CSK ఈనెల 23న చెన్నైలో క్వాలిఫైయర్-1 మ్యాచ్ ఆడనున్నాయి. 3, 4 స్థానాల్లో ఉన్న LSG, MI ఈ నెల 24న చెన్నైలో ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈనెల 26న క్వాలిఫైయర్-2, ఈనెల 28న ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

క్వాలిఫైయర్-1 లో ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్-2లో తలపడుతుంది. కాగా, తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ చేతిలో RCB ఓటమి పాలైంది. RCB నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని GT 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్(104*) సెంచరీతో అదరగొట్టగా, విజయశంకర్ 53 పరుగులతో రాణించారు. RCB ఓడిపోవడంతో 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈసారైనా ఛాంపియన్ గా నిలవాలి అనుకున్న RCB నిరాశే ఎదురయింది.

Read more RELATED
Recommended to you

Latest news