IPL 2023 : ముంబై కోసం గిల్ బాగా బ్యాటింగ్ చేశాడు..అల్లున్ని పొగిడిన సచిన్

-

IPL 2023 : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ చేతిలో RCB ఓటమి పాలైంది. RCB నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని GT 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్(104*) సెంచరీతో అదరగొట్టగా, విజయశంకర్ 53 పరుగులతో రాణించారు. RCB ఓడిపోవడంతో 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

ఈ సారైనా ఛాంపియన్ గా నిలవాలి అనుకున్న RCB నిరాశే ఎదురయింది. అయితే.. GT చేతిలో RCB ఓడిపోవడంతో ముంబై ప్లే ఆఫ్స్ కు చేరిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ అనంతరం సచిన్ టెండూల్కర్ తన ట్వీట్ లో సరదాగా ఓ విషయాన్ని పేర్కొన్నారు. ‘ముంబై కోసం గ్రీన్, గిల్ మంచి బ్యాటింగ్ చేశారు. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైని ప్లే ఆఫ్స్ లో చూడటం చాలా సంతోషంగా ఉంది’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news