BREAKING : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్

-

నెల్లూరు జిల్లాలో హై టెన్షన్‌ నెలకొంది. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.. నిరసనకు అనుమతులు లేకపోవడంతో తాము కార్యక్రమాన్ని అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ తరుణంలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని మూడేళ్లుగా కోరుతున్నామని.. ముఖ్యమంత్రి స్వయంగా మూడుసార్లు సంతకాలు చేశారని వివరించారు. నేనేమీ విధ్వంసం చేయడం లేదు..కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తానని చెప్పాను.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని హామీ ఇచ్చారు. పోలీసుల తీరు సరికాదు.. క్రిస్టియన్ కమిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం రూ.7 కోట్ల నిధులు అడిగామన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news