ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు ఘోర అవమానం చోటు చేసుకుంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్ట్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
అయితే సిసోడియాను కోర్టు నుంచి జైలుకు తరలించే క్రమంలో ఆయన పట్ల పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా ప్రశ్నలకు సిసోడియా సమాధానమిస్తుండగా… ఓ పోలీస్ అధికారి ఆయన మెడ పట్టుకొని ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్ అవుతుంది. ఇక దీని పై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ను ఇలా తీసుకెళ్లడం మేంటని నిప్పులు చెరుగుతున్నారు.
SHAME ON DELHI POLICE & NARENDRA MODI
दिल्ली पुलिस की Manish Sisodia जी के साथ ऐसा दुर्व्यवहार करने की हिम्मत कैसे हुई?
मोदी जी आपकी तानाशाही पूरा देश देख रहा है। pic.twitter.com/VyjMRLAyAN
— AAP (@AamAadmiParty) May 23, 2023