టెన్త్ తోనే గవర్నమెంట్ జాబ్.. పరీక్ష కూడా లేదు..

-

నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం పదో తరగతి తోనే ప్రభుత్వ ఉద్యోగం అందుకునే అవకాశం వచ్చింది. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో సేవక్ ఉద్యోగాలను అందుకునే అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మూడువేల ఆరు వందలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

ఇంకో విశేషం ఏంటంటే.. ఈ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగాల కోసం పరీక్షలు ఉండవు.. కేవలం టెన్ లో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టుల నియామకం ఉంటుంది. గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో
3,677 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2707, తెలంగాణలో 970 ఖాళీల్లో బ్రాంచి పోస్టుమాస్టర్, అసిస్టెంట్ బ్రాంచి పోస్టు మాస్టర్ , డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాల అర్హతలు ఏంటంటే.. పదోతరగతి లేదా తత్సమాన అర్హత. టెన్త్ లో మ్యాగ్థ్స్ , ఇంగ్లిష్ , స్థానిక భాషను తప్పనిసరిగా చదివి ఉండాలి. మొదటి ప్రయత్నంలో పదోతరగతి పాసైనవాళ్లకి ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. దీని కోసం ఎంపికైన అరవై రోజుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికెట్ ఇవ్వాలి.

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పదోతరగతిలో పొందిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేదు. ఎక్కువ అర్హతలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం, వెయిటేజీ ఉండదు. ఒకే మార్కులను పొందినవారు ఉంటే నిబంధనల ప్రకారం ఎంపిక నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబరు 14, 2019.. వివరాల కోసం http://appost.in/gdsonline వెబ్ సైట్ చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news