ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్ లో ‘Z’ అనే అక్షరం ఎందుకుంటుందో తెలుసా?

Wondered what ‘Z’ on RTC buses stands for?

ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్ లో Z అనే అక్షరాన్ని ఎప్పుడైనా గమనించారా? గమనిస్తే.. ప్రతి ఆర్టీసీ బస్సు మీద ఆ అక్షరం ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి తెలుసుకోవాలంటే మనం 87 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాం రాజులు… హైదరాబాద్ రాష్ట్రంలో రవాణా కోసం రోడ్డు, రైలు మార్గాలను వేశారు. దాని కోసం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు అనే ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా 1932 లో మొదటి సారిగా హైదరాబాద్ లో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆ బస్సులను అప్పుడు హైదరాబాద్ స్టేట్ ను పాలిస్తున్న చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్… తన తల్లి జహ్రా బేగం పేరు మీద నమోదు చేయించాడు. అందుకే… తన తల్లి పేరు వచ్చేలా Z అనే పేరు వచ్చేలా బస్సు నెంబర్లను రిజిస్టర్ చేయించారు. దీంతో కొత్త బస్సును ప్రవేశపెట్టినప్పుడల్లా.. అలాగే Z వచ్చేలా నెంబర్ ప్లేట్ ను తయారుచేసేవాళ్లు. ఆ సంప్రదాయం అలాగే కొనసాగేది.

Wondered what ‘Z’ on RTC buses stands for?

తర్వాత నిజాం.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించే సమయంలో ఓ కండిషన్ పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ప్రజా రవాణా కోసం ఆర్టీసీ ద్వారా ఉపయోగించే ఏ బస్సుకైనా Z అనే అక్షరాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలని ప్రభుత్వానికి తెలిపాడు. దీంతో ఆ సంప్రదాయం అలాగే ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది. అందుకే ఇప్పటికీ.. తెలంగాణ, ఏపీల్లోని ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్ లో Z అనే అక్షరం ఖచ్చితంగా ఉంటుంది.

Wondered what ‘Z’ on RTC buses stands for?