WTC ఫైనల్ మ్యాచ్ షెడ్యూలింగ్, వేదికపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశారు. WTC ఫైనల్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ‘IPL ఫైనల్ తర్వాతే WTC ఫైనల్ ఎందుకు షెడ్యూల్ చేయాలి. అది కూడా ఇంగ్లాండ్ లోనే ఎందుకు ఆడించాలి. ఏడాదిలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఆడించొచ్చు కదా. మార్చిలో ఎందుకు నిర్వహించకూడదు’ అని వ్యాఖ్యానించారు.
WTC 2021 ఫైనల్ ను కూడా ఇంగ్లాండ్ లోనే జూన్ లో నిర్వహించారు. WTC విన్నర్ ను నిర్ణయించేందుకు ఫైనల్ లో 3 మ్యాచుల సిరీస్ ను నిర్వహిస్తే బాగుంటుందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. WTC ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ‘ఇలాంటి ఫైనల్ కు సన్నద్ధం కావడానికి కనీసం 20-25 రోజుల సమయం కావాలి. ఐపీఎల్ తర్వాత ఎలాంటి వార్మప్ మ్యాచ్ లేకుండా నేరుగా ఫైనల్ ఆడాము. ప్లేయర్లకు తగినంత సమయంతో పాటు విశ్రాంతి అవసరం’ అని చెప్పారు.