సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పిల్లల కోసం వెళ్లిన ఓ జంటకు డాక్టర్లు షాక్ ఇచ్చారు. చాలా కాలంగా పిల్లలు పుట్టడం లేదని ఓ జంట టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కి వెళ్లింది. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని మహిళా కోరగా.. వైద్యురాలు వేరే వ్యక్తి వీర్య కణాలతో గర్భం దాల్చేలా చేసింది. అనుమానం వచ్చిన మహిళా డీఎన్ఏ పరీక్ష చేసుకోగా.. అది తన భర్త డీఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు.
శిశువు డీఎన్ఏ వేరుగా ఉండటంతో దంపతులు ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. గతంలో కూడా ఆ సెంటర్ కి అనుమతి లేదని మూసి వేసినట్టు సమాచారం. తాజాగా ఈ ఘటనతో ఆ సెంటర్ కి అస్సలు అనుమతి ఉందా..? లేదా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.