మాంచెస్టర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ 669 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 311 పరుగుల లక్ష్యంతో ఇండియా బరిలోకి దిగింది. టీమిండియా ఖాతా కూడా తెరవకుండానే ఓపెనర్ యశస్వి జైస్వాల్, థర్డ్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ వెంట వెంటనే ఔట్ అయ్యారు.
వీరిద్దరినీ క్రీస్ వోక్స్ ఔట్ చేయడం విశేషం. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ కే.ఎల్.రాహుల్, కెప్టెన్ శుబ్ మన్ గిల్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు రూట్, బెన్ స్టోక్స్ అద్భుతంగా ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఆటగాళ్లు అలాగే ఆడుతారని భావించినప్పటికీ..ఇద్దరూ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. దీంతో గిల్, రాహుల్ పై పెద్ద భారం పడనుంది. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ 2 ఓవర్లు వేసి 2 మెయిడిన్స్ చేశాడు. 2 వికెట్లు తీసుకోవడం విశేషం. తొలి ఓవర్ లో ఇద్దరూ ఔట్ అయ్యారు.