నేడు ఉప్పల్‌ స్కైవాక్‌ టవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

-

హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర సర్కార్ నగరంలో పలుచోట్ల స్కైవాక్​ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉప్పల్ చౌరస్తాలో నిర్మించిన స్కైవాక్​ను ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరగటం.. చౌరస్తా పెద్దదిగా ఉండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

660 మీటర్ల మేర ఏర్పాటుచేస్తున్న ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం కోసం హెచ్​ఎండీఏ రూ.25 కోట్లు ఖర్చుచేసింది.  ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతోపాటు మెట్రోస్టేషన్‌తో ఆ వంతెనని అనుసంధానించారు. నాలుగు వైపులనుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా దారులు ఏర్పాటు చేశారు.మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, గర్భిణులు.. స్కైవాక్‌కి చేరుకునేందుకు అత్యాధునిక ఎస్కలేటర్లు, లిఫ్టుల వంటి సౌకర్యాలు కల్పించారు. స్కైవాక్ మొత్తంపొడవు 640 మీటర్లు, వెడల్పు 3-4 మీటర్లు కాగా 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news