తారక్ మూవీలో సాయి పల్లవి.. నిజమేనా..?

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టేజ్ ను అందుకున్నారనే చెప్పాలి. ఇక ఇప్పుడు దేవర చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఇప్పుడు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో సాయి పల్లవి ఎన్టీఆర్ భార్య క్యారెక్టర్ లో కనిపించనుందని ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె గనుక ఓకే చెబితే ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ పక్కన జోడిగా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మరి ఈ సినిమాలో సాయి పల్లవి నటించబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరి ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మొత్తానికైతే ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన సాయి పల్లవి నటిస్తే ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు అప్పుడే అంచనాలు వేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుంది.. ఇందులో సాయి పల్లవి నటిస్తుందా లేదా అన్న అనుమానాలకు త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో గరుడ అనే సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news