ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు సాయంగా పోరాడుతున్న వాగ్నర్ గ్రూపు ఒక్కసారిగా రూట్ మార్చింది. రష్యాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. 24 గంటల్లో మళ్లీ ఉపసంహరించుకుంది. అయితే వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు సమయంలో ఐక్యత ప్రదర్శించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తిరుగుబాటు ముగిసిన తర్వాత పుతిన్ తొలిసారి ప్రసంగించారు. దేశాన్ని రక్షించేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలంతా తమపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అటు పరిస్థితిని రక్తపాతం కాకుండా చూసిన చాలా మంది వాగ్నర్ కిరాయి ముఠా సభ్యులకు కూడా పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.
రష్యాను బ్లాక్మెయిల్ చేయాలని, అలజడి సృష్టించాలని ప్రయత్నించినా అవేవీ ఫలించవని పుతిన్ గట్టిగా హెచ్చరించారు. ఇచ్చిన హామీ ప్రకారం వాగ్నర్ గ్రూపు సైనికులు బెలారస్ వెళ్లడానికి అనుమతి ఇస్తున్నానని.. వారు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని చెప్పారు. ఒకవేళ రష్యాకు సేవ చేయాలనుకుంటే.. రక్షణ శాఖ, మిగతా భద్రత ఏజెన్సీలతో కాంట్రాక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రిగోజిన్, మాస్కో మధ్య మధ్యవర్తిగా ఉన్నందుకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోకు కృతజ్ఞతలు తెలిపారు.