తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐసెట్ ఫలితాలను రేపు మధ్యాహ్నం గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అధికారిక ప్రకటన చేశారు. కాగా రాష్ట్రంలోని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఆ తర్వాత MBA మరియు MCA కోర్స్ లలో ప్రవేశాల కోసం ఈ పరీక్షలో ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి ICET ప్రవేశ పరీక్షలను మే 26 మరియు 27 తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ ఫలితాల కోసం విద్యార్థులు అంతా దాదాపు నెల రోజుల నుండి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజుల ఒత్తిడికి రేపటితో తెరపడనుంది, మరి ఎంతమంది ఉత్తీర్ణులు కానున్నారు అన్నది తెలియాలంటే రేపు మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.
రిజల్ట్స్ కోసం విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చిన సైట్ ను ఉపయోగించి తెలుసుకోవాలని సూచించారు.