రాహుల్ గాంధీ ముందే కాంగ్రెస్ నాయకుల కుమ్ములాటలు..వీడియో వైరల్

-

కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కుమ్ములాటలు కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి ఈ అంతర్గత కుమ్ములాటలు బయట పడ్డాయి. ఈ సారి ఏకంగా రాహుల్ గాంధీ ముందే కాంగ్రెస్ నాయకుల కుమ్ములాటలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జనగర్జన సభకు నిన్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడ్నించి హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చారు.

హెలిప్యాడ్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనగర్జన సభలో రాహుల్‌ గాంధీ ఎన్నికల హామీలను ప్రకటించారు. అయితే.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కుమ్ములాటలు స్పష్టంగా కనిపించాయి. ఫోటోలు దిగే సమయంలో.. భట్టిని కోమటిరెడ్డి నెట్టడం.. అటు రేవంత్‌ రెడ్డి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం స్పష్టం గా కనిపించింది. అలాగే, ఈ కాంగ్రెస్ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి…పెన్షన్ ప్లకార్డు విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news