ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సొంత పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ రాజకీయాలను నాటకీయంగా మార్చేస్తున్నాడు. మొన్నటి వరకు కిక్కురుమనకుండా ఉన్న రఘునందన్ రావు ఈ రోజు మీడియా ముఖంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోతున్నాడు. బీజేపీ అధిష్టానం వివిధ రాష్ట్ర అధ్యక్షులను మార్చుతుండడంతో నన్ను తెలంగాణకు అధ్యక్షుడిగా మార్చాలని అధిష్టానానికి తన అర్హతను తెలియచేస్తున్నారు. నా శ్రమను గుర్తించి ఏదో ఒక గుర్తింపు తగిన పదవిని ఇవ్వాలని రఘునందన్ రావు అధిష్టానానికి తెలియచేస్తున్నాడు. ఇక నాకులమే కొన్ని సార్లు నాకు శాపంగా మారుతోందని చెబుతూనే.. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుండి నేనే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశాడు రఘునందన్ రావు.
మరి కాసేపట్లో బీజేపీ వివిధ రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తుండడంతో రఘునందన్ ఆవేదనను అర్ధం చేసుకుంటుందా ? అహాన్ని కష్టంలో సిన్సియారిటీని గుర్తిస్తుందా తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.