ఉపాధి కల్పనలో దేశంలో 30% ఉద్యోగాలు తెలంగాణ నుంచే : కేటీఆర్

-

దేశంలోని ఉపాధి కల్పనలో 30 శాతం ఉద్యోగాలు తెలంగాణ నుంచే ఉంటున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గతేడాది నాస్కామ్ లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. గత పదేళ్లలో హైదరాబాద్‌ను దేశంలోనే లీడింగ్ ఇన్నోవేషన్ నెట్వర్క్‌గా తీర్చిదిద్దినందుకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. టీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని నోవాటెల్‌లో జరిగిన టీ ఇన్నోవేషన్-2023 సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గత పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిలో ఆవిష్కరణలకు ముఖ్యపాత్ర ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆలోచన లేనిదే ఆవిష్కరణ లేదని అన్నారు.  ఇన్నోవేటర్స్, స్టేక్ హోల్డర్స్, వ్యవస్థాపకులు, ఎకాడమీష్యన్స్ అంతా కలిసి నేటి హైదరాబాద్ స్టార్టప్ ప్రపంచాన్ని నిర్మించడంలో చేతులు కలిపారని కొనియాడారు. కేవలం ఐటీ ఉత్పత్తుల్లో మాత్రమే కాకుండా అగ్రికల్చర్‌ ఉత్పత్తుల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. మ్యాక్, సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇలా అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news