తల్లిదండ్రుల ముందే అలాంటి పని చేసి షాక్ ఇచ్చిన సాయి పల్లవి..!

-

సాధారణంగా ఎవరైనా సరే తల్లిదండ్రుల ముందు కొన్ని పనులు చేయకూడదని.. అవి చేస్తే పెద్ద ఇష్యూ అవుతుందని దాచేస్తూ ఉంటారు. ముఖ్యంగా అది చిన్న విషయం అయినా.. పెద్ద విషయమైనా తల్లిదండ్రుల ముందు దాచడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.. అయితే ఇప్పుడు గతంలో సాయి పల్లవి కూడా తన తల్లిదండ్రుల ముందు చేయకూడని పని ఒకటి చేసి ఈ విషయాన్ని స్వయంగా వారికే తెలిపిందట. మరి ఆ పని ఏంటో ఇప్పుడు చూద్దాం.. హైబ్రిడ్ పిల్లగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. నాచురల్ బ్యూటీగా ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది . మొదట్లో డాన్సులు చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేసిన ఈమె తమిళ్, మలయాళం భాషల్లో కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే అతి తక్కువ సమయంలోనే స్టార్ క్రేజ్ పొందిన ఈమె ఎంచుకునే సినిమాలు, పాత్రలు కూడా అంతే హోమ్లీగా ఉంటాయని చెప్పవచ్చు. డబ్బుకు ఆశపడకుండా అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ గ్లామర్ షో కి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. కంటెంట్ నచ్చకపోతే ఎంత పెద్ద హీరో అయినా డైరెక్టర్ అయినా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆలస్యమైనా సరే మంచి కథతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా సాయి పల్లవి డాక్టర్ చదివిన విషయం తెలిసిందే..అయితే ఒకసారి తాను స్మోకింగ్ చేయకూడదు అన్న విషయంపై అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని సిగరెట్టు తాగితే దాని వల్ల కలిగే నష్టాలు ఏంటో అక్కడున్న వారందరికీ వివరించిందట. ఇక సమయంలో తన తల్లిదండ్రులు కూడా ఉండడంతో వారి ముందే స్మోక్ చేసిందట. అయితే ఆ తర్వాత అది నిజం కాదు అని.. డమ్మీ సిగరెట్ అని తెలిపింది. అయితే సిగరెట్ తాగితే ప్రాణాలు పోవడమే కాదు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని.. ఒక దృశ్యాన్ని కూడా అందరికీ చూపించిందట సాయి పల్లవి.

Read more RELATED
Recommended to you

Latest news