మీ పిల్లలకి స్కూల్ టైం అయిపోయినా లేవట్లేదా.. ఇలా చెయ్యండి మరి..!

-

పిల్లలు రాత్రిపూట సరిగా నిద్రపోరు. ఉదయం పూట నిద్రలేవలేరు. స్కూల్ కి టైం అయిపోతున్న కూడా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. మీ పిల్లలు కూడా స్కూల్ కి టైం అయినా సరే నిద్ర లేవలేదా..? నిద్రపోతున్నారా..? ఏం చేయాలో తోచడం లేదా.. అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. పిల్లలకి స్కూల్ టైం అవుతున్న నిద్రపోతున్నట్లయితే వాళ్లని ఈ విధంగా లేపండి ఇలా కనుక మీరు పాటించారంటే కచ్చితంగా వాళ్ళు స్కూల్ టైం కి లేచేస్తారు.

పిల్లలు మొదట నిద్ర లేవకపోతున్నట్లయితే ఎందుకు వాళ్ళు నిద్ర లేవట్లేదు అనేది మీరు తెలుసుకోవాలి. రాత్రిపూట వాళ్ళు సరిగా నిద్రపోలేకపోతున్నారా లేకపోతే ఆలస్యంగా నిద్రపోతున్నారా అనేది చూసుకోవాలి. పిల్లలు రోజు 10 గంటల పాటు నిద్రపోవాలి మీ పిల్లలు మొబైల్ ఫోన్స్ వంటి వాటికి రాత్రిపూట దూరంగా ఉంటున్నారా లేదా చూసుకోండి. పిల్లలు ని ప్రేమగా దగ్గరకు తీసుకోవడం ప్రేమగా వాళ్లతో మాట్లాడటం చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఆందోళనగా ఇబ్బందిగా ఉండదు. మంచిగా నిద్ర పడుతుంది.

రాత్రిపూట పిల్లలు నిద్రపోయేటప్పుడు పెద్దలు కథలు చెప్పడం వంటివి చేస్తే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. రాత్రిపూట రేడియో ని ఆన్ చేయడం వలన కూడా వాతావరణం బాగుంటుంది. ఆనందంగా ఉంటారు. మంచి పాటల్ని కూడా మీరు రేడియోలో ప్లే చేయొచ్చు.

ఉదయాన్నే మీరు స్కూల్ కి టైం అయింది నిద్ర లేపేస్తే వాళ్లకి అయోమయంగా ఉంటుంది అలా కాకుండా ఉదయం నిద్ర లేవగానే మొక్కలకు నీళ్లు పొయ్యమని చెప్పడం, బకెట్ ఫిల్ చేయడం ఇలా కొన్ని పనులతో ఓ షెడ్యూల్ చేయండి. ఆ తర్వాత స్కూల్ కి రెడీ చేయండి. ఇలా చిన్న చిన్న పనులు చెప్పి ఆ తర్వాత స్కూల్ కి సిద్ధం చేస్తే వారు యాక్టివ్ గా వుంటారు.

 

Read more RELATED
Recommended to you

Latest news