ఏపీ ప్రజలకు శుభవార్త…21 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వనుంది జగన్ సర్కార్. సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం భూమికి సంబంధించి అనేక సంస్కరణలు చేపట్టిందని.. 20 ఏళ్ళు భూమి సాగు చేసుకున్న వారికి ఇప్పుడు యాజమాన్య హక్కులు కల్పించామన్నారు రెవెన్యు శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. యాజమాన్య హక్కు ఇవ్వటం అంటే హోదా పెంచడం…అంతే కాని అమ్ముకోవడం కోసం కాదని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 21 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉందని వెల్లడించారు.
19 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు..భూమి విషయంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు రెవెన్యు శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. సమగ్ర భూ సర్వే జరుగుతోందని.. ఇంటి పట్టా ఇచ్చిన పదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటు కల్పించామని వివరించారు. ఇనాం చట్టం వచ్చినప్పుడు అందరికి పట్టాలు ఇచ్చారన్నారు. లంక భూములకు సంబంధించి 9 వేల ఎకరాలకు పైగా భూములకు పట్టాలు ఇచ్చామని వివరించారు రెవెన్యు శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రభుత్వ ఫిలాసఫీ భూమి ఇచ్చి ప్రజల ఆస్తుల విలువ పెంచడమేనని.. ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదన్నారు.చట్టం వచ్చిన తర్వాత మాత్రమే అమ్ముకునే వెసులుబాటు ఉంటుందన్నారు రెవెన్యు శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.