సీఎం జగన్‌ ఇంటి ముట్టడి నిర్వహిస్తాం – ఏపీ సర్పంచుల సంఘం

-

సీఎం జగన్‌ ఇంటి ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించింది ఏపీ సర్పంచుల సంఘం. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ లు సమర శంఖారావం మోగిస్తూ సమావేశం నిర్వహించారు. సర్పంచులు అందరూ ఒక తాటి మీదకి రావాలని పిలుపునిచ్చింది సర్పంచుల సంఘం. ఈ సందర్భంగా ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…. సీఐడీ కార్యాలయంలో త్వరలో కంప్లైంట్ ఇస్తామని… మా డిమాండ్లు పట్టించుకోనందుకు ఆందోళనలకు సిద్ధం అయ్యామన్నారు.

మాడుగుల నియోజకవర్గంలో ఉన్న పంచాయితీరాజ్ శాఖామంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆర్ధిక శాఖామంత్రి బుగ్గన ఇంటిని కూడా కర్నూలుజిల్లా బేతంచర్లలో ముట్టడిస్తామని.. ఈనెల 17న అన్ని జిల్లాల ఎస్పీలకు పంచాయితీల నిధుల దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇస్తామన్నారు. ఈనెల 20న అన్ని గ్రామ పంచాయితీలలో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తామని… మా 12 డిమాండ్లు నిర్వహించాలని సీఎం, పంచాయితీ శాఖామంత్రి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి కి తీర్మానాలు పంపుతామని వివరించారు. ఈ నెలాఖరున ఛలో ఢిల్లీ తేదీ ప్రకటిస్తామని.. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. అసెంబ్లీ జరిగేటప్పుడు విజయవాడలో రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తామని… సెప్టెంబరులో సీఎం ఇంటి ముట్టడి నిర్వహిస్తామని హెచ్చిరించారు ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news