Business Ideas : ఈ వ్యాపారాన్ని రూ. 80 వేలు ఉన్నా మొదలుపెట్టొచ్చు.. లాభం దండిగానే..!

-

బిజినెజ్‌ చేయాలానే ఆలోచన మీకు ఉంటే.. ఒక మంచి ఐడియా మీ కోసమే. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం ఇది. ఇంటి వద్ద నుంచే పని చేయాలని కోరుకునే వారికి మ్యాంగో పికిల్‌ బిజినెస్‌ బెస్ట్‌ ఐడియాగా చెప్పుకోవచ్చు. దీంట్లో లాభాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఈ వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఇందుకు ఏమేం అవసరం, పెట్టుబడి ఎంత ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Business Ideas
Business Ideas

భారతీయుల భోజనాల్లో ఊరగాయలు ఒక ముఖ్యమైన భాగం. ప్రతి ఇంట్లో ఇలాంటి నిల్వ పచ్చళ్లు ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఒకప్పుడు పచ్చళ్లు విక్రయించే ఈ స్థాయికి చేరారు. వేసవిలో దొరికే మామిడి కాయలతో చేసే ఆవకాయ, ఊరగాయలను ఏడాదంతా రుచి చూస్తుంటారు. అలాగే, మిగతా పికిల్స్ కూడా బాగా ఇష్టపడతారు. అయితే తక్కువ పెట్టుబడితో, ఇంటి వద్ద నుంచే పని చేయాలని కోరుకునే వారికి పికిల్‌ బిజినెస్‌ బెస్ట్‌ ఐడియాగా చెప్పుకోవచ్చు.

పికిల్‌ బిజినెస్‌ తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలను అందిస్తుంది. ప్రత్యేకించి గృహిణులు, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనుకునే మహిళా వ్యాపారవేత్తలకు ఈ లో-రిస్క్‌ కంపెనీ ఐడియా సరిపోతుంది.ఊరగాయల తయారీ ప్రారంభిచేందుకు బిజినెస్‌ రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ అవసరం. ఇవి రెండూ లేకుండా మ్యాంగో పికిల్‌ బిజినెస్‌ మొదలుపెట్టలేరు. ఊరగాయలు ఫుడ్‌ రిలేటెడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ కాబట్టి, ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రతినిధులు మీ ప్రొడక్టును పరిశీలించిన తర్వాత లైసెన్స్ ఇస్తారు.

ఇందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఒకటి నుంచి రెండు నెలల వ్యవధిలో క్రియేట్‌ అవుతుంది. లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లో కూడా యాక్సెస్ చేయవచ్చు, 10 నుంచి 15 రోజుల్లో పొందవచ్చు. తర్వాత మీ సంస్థను ప్రారంభించడానికి, MSME ఇండస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలి.
స్మాల్‌ స్కేల్‌ పికిల్‌ బిజినెస్‌ స్టార్టప్‌ ఖర్చు రూ.80,000 నుంచి రూ.1,00,000 వరకు అవుతుంది. ఇది ముడి సరుకు, సామగ్రి, ఇతర ఖర్చులకు సరిపోతుంది. పికిల్‌ మేకింగ్‌ సెక్టార్‌లో ప్రాఫిట్‌ మార్జిన్‌ ఎక్కువగా ఉండే ఐటెమ్స్ తయారు చేయడంపై దృష్టి పెట్టాలి.

లోన్‌ సదుపాయం కూడా పొందవచ్చు..

పికిల్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి పీఎం ముద్ర లోన్ పొందవచ్చు. అవసరాలకు అనుగుణంగా ప్రధాన్ మంత్రి ముద్ర లోన్ ద్వారా వివిధ రకాల లోన్‌లు అందిస్తారు. శిశు లోన్‌ కింద రూ.50 వేల వరకు, కిషోర్ లోన్ కింద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్‌ పొందవచ్చు. తరుణ్ లోన్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అందుకునే అవకాశం ఉంది. కంపెనీ ప్లాన్‌కు అనుగుణంగా ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ డబ్బుతో బిజినెస్ ప్రారంభించాలను కునేవారికి శిషు లోన్ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

మీకు ఆసక్తి ఉంటే ట్రై చేసి చూడండి. అయితే పచ్చళ్లు బాగా చేసే నైపుణ్యం ఉంటేనే ఇందులో సక్సస్‌ అవుతారు. లేదంటే మీరు ఎంత డబ్బు పెట్టినా పచ్చళ్లు రుచిగా లేకపోతే ఎవరూ తీసుకోరు.!

Read more RELATED
Recommended to you

Latest news