సమంతను ఈ రేంజ్ లో వాడుతున్నారే..!

-

సౌత్ లో క్రేజీ బ్యూటీగా సమంత చాలా పాపులర్. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా అడుగుపెట్టిన సమంత తన క్రేజ్ తో వారికి స్టార్ ఇమేజ్ వచ్చేలా చేస్తుంది. కింగ్ నాగార్జున తప్ప అక్కినేని హీరోలంతా అంత సక్సెస్ అవలేదు. చైతు తన ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా పర్టిక్యులర్ ఇమేజ్ అంటూ రాలేదు. ఇక అఖిల్ చేసిన రెండు సినిమాలు చతికిల పడ్డాయి. ప్రస్తుతం సుశాంత్ హీరోగా వస్తున్న చిలసౌ సినిమాకు అక్కినేని ఫ్యామిలీ సూపర్ సపోర్ట్ ఇస్తుంది.

నాగ చైతన్య, సమంతలు స్పెషల్ ఇంట్రెస్ట్ మీద చిలసౌ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా సమంతను ఈ సినిమా ప్రమోషన్స్ కు వాడటం అక్కినేని ఫ్యామిలీ తెలివిటేటలు సూపర్ అనేస్తున్నారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ప్రమోట్ చేస్తే కచ్చితంగా ఆమె ఫ్యాన్స్ అందరికి నచ్చేస్తుందని వార్ ప్లాన్.

రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సుశాంత్ సినిమాలకు ఎన్నడు లేని విధంగా ప్రీ రిలీజ్ బజ్ ఉంది. మరి సమంత, చైతుల సపోర్ట్ సుశాంత్ ను ఏమేరకు కాపాడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news