మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు.. జలమండలి స్ట్రాంగ్ వార్నింగ్‌

-

గత ఐదు రోజుల నుంచి భాగ్యనగరాన్ని వాన ముంచెత్తుతోంది. ముసురులా మొదలై భారీ వర్షంగా మారి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జలమండలి అప్రమత్తమైంది. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నగరంలో తాగునీటి సరఫరా, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సమయంలో కలుషితనీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

ముఖ్యంగా సీవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే మ్యాన్‌హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఎండీ చెప్పారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. మ్యాన్‌హోళ్ల మూతలు తెరవడం జలమండలి యాక్ట్‌లోని 74వ సెక్షన్‌ ప్రకారం నేరమని, అతిక్రమిస్తే.. క్రిమినల్‌ కేసులు నమోదవుతాయని ఎండీ హెచ్చరించారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్‌ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబర్‌ 155313కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news