ఏపీ ప్రజలకు షాక్.. వాహనమిత్ర, కాపునేస్తం పథకాలలో కోత పెట్టేందుకు సిద్ధమైంది జగన్ సర్కార్. ‘వాహన మిత్ర’ పథకాన్ని ఏటా (రూ.10000) వృత్తి ప్రాతిపాదికగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అందుకే కల్లుగీత కార్మికులు, చర్మకారులకిచ్చే సామాజిక పింఛన్ పొందేవారు వాహనమిత్రకు అనర్హులని పేర్కొంది.
అలాగే అంగన్వాడి, ఆశా కార్యకర్తలను కాపు నేస్తానికి (ఏటా రూ.15000) అనర్హులుగా పేర్కొంది. వారి కుటుంబంలో మరొకరు ఈ పథకానికి అర్హులు అయితే వర్తింపజేస్తామని సచివాలయాలకు సమాచారం పంపింది. అయితే.. వాహనమిత్ర, కాపునేస్తం పథకాలలో కోత పెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధం కావడంతో….ఏపీ ప్రతి పక్షాలతో పాటు.. ప్రజలు కూడా ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.