తెలంగాణ ప్రజలకు అలర్ట్. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 24న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్ర సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పారు.
కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక 24న మరో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే.. దాని ప్రభావంతో 25, 26 తేదీల్లో భారీ నుంచి అతిభారి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 25న సూర్యాపేట, KMM, NLG, మహబూబాబాద్ 26న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.