ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఇప్పుడు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఓ వాలంటీర్ పై కేసు నమోదు అయింది. తిరుపతిలో వాలంటీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు ఇద్దరు దంపతులు.
తమకు కేటాయించిన స్థలంలో వాలంటీర్ రేకుల షెడ్డు వేస్తుండగా అడ్డుకున్నారు సదరు దంపతులు. వాలంటీర్… విఆర్వోతో కలసి పొసిషన్ సర్టిఫికెట్ సంపాదించి ఆక్రమణలకు యత్నిస్తున్నాడని ఆరోపణలు చేశారు. అయితే.. రేకుల షెడ్డు వేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వాలంటీర్ దాడి చేశాడంటున్నారు ఆ దంపతులు రామకృష్ణ, ఈశ్వరి. ఈ సంఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి (మం) కల్ రోడ్డు పల్లెలో చోటు చేసుకుంది.