జగన్ అక్రమాలపై… ఈ వాట్సాప్ నంబర్ కు సమాచారం ఇవ్వండి – చంద్రబాబు

-

టీడీపీలోని వివిధ స్థాయి నేతలు, కేడరుతో తాజాగా.. చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై చర్చ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో గ్రామ స్థాయిలోని ప్రతి ఒక్క బిఎల్‌ఏ డోర్ టు డోర్ ప్రోగ్రాం లో పాల్గొనాలన్నారు. జాబితా సవరణపై వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కోరారు.

అధికార పార్టీ నేతలు ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుంటే వెంటనే 9182981134 నెంబరుకుకు వాట్సప్ చేయాలని వెల్లడించారు. అవకతవకలపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలి….కీలకమైన ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో పని చేసే ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకుంటామన్నారు. వారికి పార్టీలో సముచితమైన గౌరవమిస్తామని.. అధికార పార్టీ నేతల అరాచాకాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని స్పష్టం చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news