రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ధాటికి అన్ని విద్యాసంస్థలకు తెలంగాణ సర్కారు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది.
అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉందని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.