ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మరియు వైసీపీ పార్టీల మధ్యన పొలిటికల్ వార్ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది, ఇక ప్రభుత్వం పైన ఏదో ఒక విమర్శలు చేయకుంటే పొలిటికల్ కెరీర్ ముందుకు పోవడం కష్టం కాబట్టి ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ కు గతంలో వ్యవసాయశాఖకు మంత్రిగా చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తుతం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించాడు. ఈయన మాట్లాడుతూ… వైసీపీ పాలనలోకి వచ్చాక వ్యవసాయం పరిస్థితి అధోగతి అయిందని ఆరోపించారు.. వ్యవసాయ శాఖ అసలు పనిచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు సోమిరెడ్డి. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్టలు కొడుతోందని అర్ధం లేని ఆధారాలు లేని కామెంట్స్ చేశారు సోమిరెడ్డి.
ఇక ఇప్పుడు వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి అసలు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా అంటూ సూటిగా ప్రశ్నించాడు. రైతుల బ్రతుకులతో ఆదుకోవడం ఆపండంటూ సోమిరెడ్డి ప్రభుత్వాన్ని మరియు మంత్రిని విమర్శించారు.