కడెం ప్రాజెక్టు ప్రమాదం పడింది. కడెం జలాశయం వద్ద వరద మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గతేడాది భారీ ఎత్తున పోటెత్తిన్న వరద భయం మరోసారి కళ్లముందు కదులుతోంది. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి మళ్లీ ప్రమాదకరస్థాయిలో వరద వస్తోంది. సామార్థ్యాన్ని మించి చేరిన భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కెపాసిటీ 3లక్షల 50 వేలు కాగా… 3లక్షల 87వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో చేరుతోంది.
14 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. మరో 4 గేట్లు తెరుచుకోకుండా మొరాయిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 700 అడుగులకు గాను… ప్రస్తుతం నీటిమట్టం 700 అడుగులకు చేరింది. జలాశయం ఔట్ ఫ్లో 2.4 లక్షల క్యూసెక్కులు ఉంది. భారీ వరద రావడంతో.. కడెం ప్రాజెక్టు పై నుంచి నీళ్లు వెళుతున్నాయి.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి అతి భారీ వరద.. ప్రాజెక్టు మీద నుండి పోతున్న వరద నీరు
పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎమ్మేల్యే రేఖా నాయక్.
బోథ్, బజార్ హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో రాత్రి నుండి కురుస్తున్న భారీవర్షం.#Kadem #KademProject pic.twitter.com/uITxUDGvMb
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2023