ఓ సాధువూ.. నీ హెయిర్ స్టైల్ కథేంటి!

-

సాధువు అనగానే బూడిదరంగు బట్టలు, మెడలో రుద్రాక్షలు, నుదిటి మీద విభూది, కుంకుమ, గంధంతో పెట్టుకున్న తిలకం, చేతిలో కమండలం, తలపై పొడవాటి వెంట్రుకలతో సాధువు రూపం గుర్తుకువస్తుంది. వీరు సామాన్య ప్రజలకంటే భిన్నంగా ఉంటారు. అంతేకాదు అందిరిలో ఉండే లక్షణాలు సాధువుల తల వెంట్రుకల్లో కనబడుతాయి. పిచ్చిగా కనిపించే వారి వెంట్రుకల వెనుక చాలా రహస్యాలు దాగున్నాయని చరిత్ర చెబుతున్నది. మరి ఆ కథేంటో తెలుసుకుందాం.

పూర్వం నుంచి సాధువులు, మత గురువులు ధ్యానంకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. సాధువులు ఇల్లు, వాకిలి, సంసారాన్ని త్యాగం చేసి దేవాలయాల్లోనో, హిమాలయాల్లోనే ధ్యానం చేసుకుంటుంటారు. సాధువులు ఎప్పుడూ మాసిన దుస్తులతోపాటు బూడిద రంగు దుస్తులు ధరిస్తారని పెద్దలు చెబుతుంటారు. వీరిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా రకరకాల ఆచారాలను పాటిస్తారు. సాధువుల అలంకారణ, తల వెంట్రుకల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

వెంట్రుకల ప్రత్యేకత

సాధువుల వెంట్రుకలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మురికిగా కనిపించే జుట్టును చూస్తే తలస్నానం చేసి ఎన్ని రోజులు అయింటుందో అన్న అనుమానం వస్తుంది. వాస్తవానికి సాధువులు చాలా శుభ్రంగా ఉంటారు. వెంట్రుకల కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. మహాకుంభ మేళకు వచ్చే వారికి సాధువుల దర్శనం కలుగుతుంది. వారి వెంట్రుకల విషయంలో తీసుకునే జాగ్రత్తలపై చాలామంది ఆసక్తిగా వివరాలు సేకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధువులు తల వెంట్రుకల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరని వాటిని శుభ్రంగా పెట్టుకోరని, వాటి గురించి అసలు పట్టించుకోరని చాలామంది భావన. అయితే మహాకుంభ మేళలో ప్రజల అనుమానాలు తప్పని తేలింది. నిజానికి సామాన్య ప్రజలు తల వెంట్రుకల విషయంలో తీసుకునే జాగ్రత్తల కంటే సాధువులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు.

హెయిర్ స్టైల్

ఒక సాధువు తల వెంట్రుకలను మరొక సాధువు అలంకరిస్తారు. వెంట్రుకల విషయంలో వీరు చూపించే శ్రద్ధ చూస్తే ఆశ్చర్యపోతారు. సాధువు సాటి సాధువు తల వెంట్రుకలను పెద్ద సూదితో విడదీసి దారంతో ముడివేస్తుంటారు. తర్వాత సూదితోనే తల వెంట్రుకలకు ప్రత్యేక ఆకారం వచ్చేలా చూస్తారు. చివరికి తల వెంట్రుకల చివరిలో ఆ పెద్ద సూదిని అడ్డంగా గుచ్చుతారు. సాధువు తలమీద ఉన్న వెంట్రుకలను బన్ను ఆకారంలో గుండ్రంగా పెట్టి తర్వాత వాటిని పొడవుగా వదిలేస్తారు. తల వెంట్రుకలను పెద్ద సూదితో విడదీసి దారంతో అల్లుకోవడం సాధువుల ప్రత్యేకత. తల వెంట్రుకలను సాధువులు విడివిడిగా ముడివేస్తారు. తల వెంట్రుకలు అందంగా వచ్చే వరకూ సాధువులు వాటిని చక్కగా అలంకరించుకుంటారు. వీరి హెయిర్‌ైస్టెల్ ఫాలో అవ్వాలంటే అంత సాధ్యం కాదు.

An Aghori Sadhu (holy man) with his human skull at a ghat in Varanasi, Uttar Pradesh, India.

తలవెంట్రుకలు శుభ్రం

సాధువులు తలవెంట్రుకలను శుభ్రపరిచేందుకు చాలా సమయం తీసుకుంటారు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. తల వెంట్రుకలను అలంకరించుకోవడానికి సాధువులు చాలా సమయాన్నే కేటాయిస్తారు. వారు సొంతంగా తయారు చేసుకున్న షాంపూతోనే తల వెంట్రుకలు శుభ్రం చేసుకుంటారు. నాటురకం షాంపూతో తలవెంట్రుకలు శుభ్రం చేసుకుంటే అందంగా, ఆకర్షణీయంగా, పొడవుగా పెరుగుతాయని సాధువులు చెప్పుకొచ్చారు. ఒక్కసారి తలవెంట్రుకలు శుభ్రం చేసుకొని వాటిని చక్కగా జడ వేసుకుంటే సుమారు నెలరోజుల పాటు అలాగే ఉంటాయి. తలస్నానం చేసి ముడి పెడితే మరలా నెలరోజుల తర్వాత గాని వాటి గురించి ఆలోచించరని అంటున్నారు. తలకు ప్రత్యేకంగా ఎలాంటి నూనె వాడరు. సాధువుల హెయిర్ ైస్టెల్ ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారింది. ఇటీవల కాలంలో యువకులు, విదేశీయులు సాధువుల మాదిరిగా తలవెంట్రుకలను ప్రత్యేకంగా అలంకరించుకుంటున్నారు. యువతరం ఈ హెయిర్‌ైస్టెల్‌వైపు మొగ్గు చూపుతున్నారు. 21వ దశాబ్దంలో విదేశీయులు ఎక్కువగా భారతదేశ సంస్కృతికి అలవాటు పడ్డారు. ఏదేమైతేనేం సాధువుల హెయిర్‌ైస్టెల్ ఓ ట్రెండ్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news