వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో 18 మంది మృతి.. 12 మంది గల్లంతు

-

తెలంగాణలో వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు విలయం సృష్టించాయి. ఎడతెరిపి లేని వాన ఓవైపు.. వరద ఉద్ధృతి మరోవైపు.. ఊళ్లన్నీ ఏళ్లుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని వాన వదిలినా.. వరద బెడద మాత్రం వీడలేదు. చాలా వరకు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మరోవైపు వరద బీభత్సం రాష్ట్రంలో విషాదాన్ని మిగిల్చింది.

వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది మృతి చెందగా.. 12 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా పలువురు మృత్యువాత పడ్డారు. కొండాయి గ్రామానికి చెందిన బంధువులైన ఎనిమిది మంది జంపన్నవాగులో గురువారం గల్లంతు కాగా.. వారి మృతదేహాలు శుక్రవారం బయటపడడంతో విషాదం నెలకొంది. గురువారం గల్లంతైన మొత్తం 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వర్షాల వల్ల విద్యుదాఘాతంతో ఒకరు, చెట్టు ఇంటి గోడపై కూలి మరొకరు కన్నుమూశారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని రామన్నపేట ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి మృతదేహం నీళ్లలో తేలింది. హనుమకొండ గోపాల్‌పూర్‌ చెరువులో లభ్యమైంది. మేడారంలో ఒక యాచకుడి మృతదేహం దొరికింది.

Read more RELATED
Recommended to you

Latest news