గత 10 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ తో భవిష్యత్తు రాజకీయాల గురించి చర్చించారట. కాగా ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ ఛరిస్మా ఏపీలో పనిచేస్తుండడంతో బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ సీటును ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందట. కానీ పవన్ కళ్యాణ్ ఈ ఆఫర్ ను వద్దని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ వద్దని చెప్పినప్పటికీ ఇంకా ఆ ఆఫర్ కొంతకాలం వరకు వాలిడ్ లోనే ఉంటుందని తెలుస్తోంది. కాగా జనసేన కు వచ్చే ఎన్నికల్లో కనీసం 10 సీట్లు అయినా వస్తే బీజేపీకి ఏపీలో రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశంగా ఉంటుందని ప్రయత్నాలు చేస్తోంది. జనసేన మరియు బీజేపీ లకు లాభంగా ఉండేలాగానే వీరి అనుబంధం కొనసాగుతుందని టాక్.
ఇదంతా కూడా కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తేనే అని తెలుస్తోంది. ఒకవేళ ఏపీలో వైసీపీ మద్దతు అవసరం అయితే అప్పుడు సీన్ మొత్తం రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.