తాటికొండ నుంచి పోటీపై ఎమ్మెల్సీ డొక్కా కీలక ప్రకటన చేశారు. సీఎం జగన్ ఆదేశిస్తే గుంటూరు జిల్లా తాటికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై వాక్యాలు చేయడం సరికాదన్నారు.
తుఫాన్లు, వరదల సమయంలో వారు ప్రాణాలకు తెగించి సేవలందించారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ పాటుపడుతుంటే… బిజెపి నేతలు అప్పులు చేస్తున్నారని విమర్శించడం తగదన్నారు. కాగా, ఒకే ఇంటి నంబర్ పై 448 ఓట్లు నమోదైన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పిఠాపురం పట్టణ పరిధి అగ్రహారం 125 బూతులోని 1-2-63 డోర్ నెంబర్ పై 448 ఓట్లు ఉండడంతో అధికారులు పరిశీలించారు. ఓకే ఇంటి నెంబర్ పై ఎక్కువ ఓట్లు ఉన్న మాట వాస్తవమేనని… ఈ ఓటర్లలో ప్రస్తుతం ఉన్న వారివి, లేనివారి వివరాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు.