తెలంగాణ ప్రజలను గత వారం రోజులుగగా వర్షాలు అష్టకష్టాలు పెట్టిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాదులో వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టగా… రానున్న రెండు రోజుల్లో హైదరాబాదులో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్…కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది.
కాగా,తెలంగాణలోని వరద పరిస్థితిపై మూడో రోజూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పర్యవేక్షణ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తాజాగా మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చారు.