హబ్సిగూడ అగ్నిప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్

-

హైదరాబాద్‌ నగరంలోని హబ్సిగూడలో ఇవాళ నాలుగు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని హోటల్‌లో చెలరేగిన మంటలు.. మెుదటి అంతస్తులోని వస్త్ర దుకాణానికి వ్యాపించాయి. 10 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు ఆర్పినా.. ఇంకా దట్టంగా పొగలు వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

మంటలు చెలరేగిన వ్యాపార సముదాయం పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకు ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా పెట్రోల్‌ బంకును పోలీసులు మూసివేయించారు. అగ్నిప్రమాదం జరిగిన దుకాణాల అద్దాలను GHMC సిబ్బంది తొలగించారు. అగ్నిప్రమాదంతో ఉప్పల్‌ నుంచి హబ్సిగూడ మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్​లో చిక్కుకోవడం ఒక సమస్య అయితే.. అక్కడ ఆగిన సమయంలో వస్తున్న పొగలతో కళ్లు మండుతుండటం మరో సమస్యగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు రాకపోకలను పునరుద్ధరించే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news