వికలాంగుల్లో యూపీ కంటే ఏపీనే ఫస్ట్ !

-

వికలాంగుల్లో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లక్షన్నర మంది వికలాంగులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా ఏడు లక్షలకు చేరిందని అన్నారు. ఒకేసారి వికలాంగుల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణాలు ఏమిటంటే… ఓట్ల కొనుగోలుకు, స్థానిక నాయకులను వశపరచుకోవడానికి తమ పార్టీ పెద్దలు ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని అత్యధికంగా వికలాంగులుగా చూపిస్తున్నారని తెలిపారు.

andhra-pradesh

కడప జిల్లాలోని వీరపనాయుని మండలం ఎన్ పాల గిరి గ్రామంలో ఉన్న జనాభానే తక్కువ అంటే అందులో 215 మంది వికలాంగులు ఉండడం ఆశ్చర్యకరం అని అన్నారు. వీరిలో ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారని వివరించారు రఘురామకృష్ణ రాజు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వికలాంగులు పెరిగిపోయారని చెప్పుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని, అర్హులైన వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను, పక్కదారి పట్టించడానికి అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్న వారిని కూడా తప్పుడు సర్టిఫికెట్లతో వికలాంగుల జాబితాలో చేరుస్తున్నారని, దీనివల్ల అర్హులైన వారికి అందాల్సిన లబ్ది, అనర్హులకు కూడా అందుతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news