తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. ఖుషీ లో ఫ్యామిలీ..!

-

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాంట్రవర్సీకి ఎప్పుడు దూరంగా ఉండే మంచు మనోజ్ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మంచు మనోజ్ అంటే సెలబ్రిటీలకే కాదు అభిమానులకు విపరీతమైన గౌరవం , అభిమానం కూడా.. ఇదిలా ఉండగా మంచు మనోజ్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అంటూ ఒక శుభవార్త హల్చల్ చేయడంతో అటు మంచు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకెళితే ఇటీవలే మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరూ కూడా మొదటి పెళ్లిళ్ళను బ్రేకప్ చేసుకొని.. ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే మంచు మనోజ్ కు మొదటి భార్యతో పిల్లలు కలగలేదు. కానీ మౌనిక రెడ్డికి మొదట భర్త తో ఒక కొడుకు జన్మించాడు . అయితే వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత శివుడు ఇచ్చిన బిడ్డ అంటూ మౌనిక రెడ్డి కొడుకుని మంచు మనోజ్ తన సొంత బిడ్డ లాగా స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మంచు మనోజ్ , మౌనిక దంపతులకు కూడా పిల్లలు పుడితే బాగుంటుంది అని మంచు లక్ష్మి తన అభిప్రాయంగా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

అందులోనూ మంచు విష్ణు, లక్ష్మీ పిల్లలతో మంచు మనోజ్ గా ఆడుకుంటూ ఉంటాడు. ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు తాను కూడా ఒక బిడ్డకు తండ్రి కావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భూమా మౌనిక కూడా తల్లి కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒక జంటకు పెళ్ళైన మూడు నెలల్లో ఇలాంటి వార్తలు రావడం సహజం. మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే మంచు మనోజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news