`రజిత హత్య` కేసును ఛేదించిన పోలీసులు

-

హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌లో ఈ నెల 19వ తేదీన జరిగిన మహిళ హత్యోదంతం కలకలం రేపింది. తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. అయితే చివ‌ర‌కు ‘రజిత హత్య’ కేసును పోలీసులు ఛేదించారు. మునగనూరులో ప్రియుడితో కలిసి తన తల్లి రజితను కీర్తి అనే యువతి దారుణంగా హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిన విషయం తెలిసిందే. ప్రియుడు శశికుమార్ తో కలిసి తల్లి రజితను కుమార్తెనే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో కీర్తి, శశికుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపి, అన్ని వివరాలను సేకరించారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news