కనుబొమ్మలు మందంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

కొంతమందికి కనుబొమ్మలు చాలా లైట్ గా ఉంటాయి చూడడానికి అసలు బాగోదు. నిజానికి కనుబొమ్మలు ఉన్నాయా లేదా అనేది కూడా క్లియర్ గా తెలియదు. కనుబొమ్మలు బాగుంటే మనం ఇంకాస్త అందంగా కనపడవచ్చు. కనుబొమ్మలు ఒత్తుగా మందంగా ఉండాలంటే ఇలా చేయండి అమ్మాయిలకి కనుబొమ్మలు నల్లగా మందంగా ఉంటే ఎంతో అందంగా కనిపిస్తారు మందంగా లేకపోతే చూడడానికి బాగోదు. అయితే కనుబొమ్మలు మందంగా నల్లగా మారాలంటే అలోవెరా జెల్ ఉపయోగించండి.

అలోవెరా జెల్ ని అప్లై చేసుకోవడం వలన కనుబొమ్మలు మందంగా ఉంటాయి అలోవెరా జెల్ ని రోజుకి రెండు సార్లు కనుబొమ్మల మీద రాసి రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేయండి ఇలా చేయడం వలన చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. కొబ్బరి నూనె కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది కనుబొమ్మలు మందంగా నల్లగా ఉండాలంటే కొబ్బరి నూనె రాసుకోండి కాసేపు కనుబొమ్మలని మసాజ్ చేయండి ఇక తిరుగే ఉండదు. ఒత్తుగా కనుబొమ్మలు ఎదుగుతాయి.

పచ్చిపాలతో కూడా కనుబొమ్మలని అందంగా మార్చుకోవచ్చు పచ్చిపాలని కనుబొమ్మల మీద రాసి కొంచెం మసాజ్ చేస్తే సరిపోతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా మీరు రాసుకోవచ్చు ఉల్లిపాయ రసం రాసుకుంటే కూడా కనుబొమ్మలు మందంగా ఎదుగుతాయి. ఆలివ్ ఆయిల్ ని కనుబొమ్మల మీద రాసుకుంటే కనుబొమ్మల మందంగా ఎదుగుతాయి అందంగా కనపడతాయి ఈసారి కనుబొమ్మలు మందంగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇక మీ అందాన్ని ఇంకాస్త పెంచేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news