ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సారి తన నియోజకవర్గాన్ని మార్చుకుంటారేమో అన్న చర్చ బలంగా జరుగుతోంది. ఎందుకంటే… గతంలో కుప్పం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా వినిపిస్తోంది. అయితే వైసీపీ నాయకులు కొందరు అంటున్న ప్రకారం ఇంతకాలం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం లో వరుసగా గెలుస్తున్నారంటే ఏమో అనుకున్నాం.. కానీ దొంగ ఓట్ల తోనే వరుసగా గెలుస్తూ వస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు సాక్ష్యమే.. ఈ మధ్యన కుప్పం నియోజకవర్గంలో మొత్తం నలభై వేల ఓట్లు బయటపడ్డాయి. కానీ ఈ ఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి తీసివేస్తుండడం వలన ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదనే అంటున్నారు వైసీపీ నేతలు.
మరి నిజంగా చంద్రబాబు తాను పోటీ చేసే స్థానాన్ని మార్చుకుంటారా ? ఒకవేళ ఇది నిజం అయితే ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు అన్నది ప్రధానాంశంగా మారింది.