‘బ్రో.. స్మైల్ ప్లీజ్’..అంటూ విక్రమ్‌ ఫొటోలు తీసిన ప్రజ్ఞాన్‌

-

ప్రపంచంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ కీర్తి గడించింది. చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక విక్రమ్ ల్యాండర్​లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి.. జాబిల్లి ఉపరితలంపై సంచరిస్తోంది. చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా తనను అక్కడిదాకా మోసుకెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ను బుధవారం ఫొటోలు తీసింది ప్రజ్ఞాన్ రోవర్.

రోవర్‌పై ఉన్న నావిగేషన్‌ కెమెరా ఈ చిత్రాలను క్లిక్‌ మనిపించింది. ‘స్మైల్‌.. ప్లీజ్‌’ అన్న క్యాప్షన్‌తో సంబంధిత ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్‌-3 కోసం నావిగేషన్‌ కెమెరాలను ఇస్రో విభాగమైన లేబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో-ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌ (లియోస్‌) అభివృద్ధి చేసింది. ల్యాండర్‌ పాదాల వద్ద అమర్చిన చాస్టే, ఐఎల్‌ఎస్‌ఏ పేలోడ్‌లు ఓ చిత్రంలో కనిపించాయి. చాస్టే ఇటీవల చంద్రుని ఉపరితలం, లోతుల్లోని ఉష్ణోగ్రతల స్థాయులను గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Latest news