జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. APPSC నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలకు సంబంధించిన ఫీజులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్, స్టేషనరీ తదితర చార్జీలు పెరగడంతో ఫీజులు సవరించాలని ఏపీపీఎస్సీ ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
డిపార్ట్మెంటల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టులకు సంబంధించిన రికౌంటింగ్ ఫీజును రూ. 50 నుంచి రూ. 300కు, మార్కుల మెమో ఫీజులు రూ. 25 నుంచి రూ. 200 కు పెంచింది. కాగా, డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తితో ఇప్పటికే ఎస్బిఐ వడ్డీ తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది.