రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..వీడియో వైరల్

-

రక్షాబంధన్ పురస్కరించుకుని ములుగు ఎమ్మెల్యే సీతక్క… టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ‘రాజకీయాలతో పరిచయమైన ఈ బంధం… రాజకీయాలకి అర్థం కానంత పవిత్రమైన బంధంగా మారింది. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉంటున్న ప్రతి ఒక్క సోదరుడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు’ అని సీతక్క ట్వీట్ చేశారు.

ఇది ఇలా ఉండగా… అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతిరూపం రాఖీ పండుగ అని దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్న ప్రజలందరికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news