ఎన్నో కలలతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్న జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ ను వదిలి, తెలంగాణకు వచ్చేసింది. ఇక్కడ YSRTP పేరుతో పార్టీని స్థాపించి వైఎస్సార్ కలలను సాకారం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. అయితే తండ్రిని చూసి తనకు ఓట్లు వేస్తారా అన్నది సందేహమే. అందుకే షర్మిల ఒక భారీ ప్లాన్ లో భాగంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఆలోచన ఎవరిది అన్న విషయం పక్కన పెడితే కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేయడానికి చర్చలు జరుగుతున్నాయని భోగట్టా. ఇప్పటికే షర్మిల కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలవాలని భావించినా ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా కావలేకపోయింది. ఇక తాజాగా భర్త అనిల్ తో కలిసి షర్మిల ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసినట్లుగా తెలుస్తోంది.
సోనియా గాంధీ విలీనం అంశంపైన ఒక నిర్ణయం తీసుకుని ఉంటారన్నది రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. కానీ అధికారికంగా ఇంకా కాంగ్రెస్ కానీ , షర్మిల కానీ ప్రకటించలేదు.